Monday, April 29, 2024

ప్రేమంటే ఎమిటంటే?.. చంద్రుడిపై ఎకరం జాగా కొని కానుకగా ఇచ్చిన ప్రేమికుడు!

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా.. నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా.. అని ఓ సినిమాలో అద్భుతమైన భావ కవిత్వపు పాట ఉంటుంది. అదే తరహాలో ఈ ప్రేమ జంట తమ ప్రేమకు గుర్తుగా ఎన్నో ఊసులు చెప్పుకున్నారు.  చాలా కాలంగా యువతుల అందాన్ని జాబిలితో పోల్చడం.. మచ్చలేని అందం అంటూ పొగడ్తలతో ముంచెత్తడం వంటివి చాలామంది చేస్తుంటారు. కొంతమంది అయితే తమ కాబోయే పార్టనర్​ని చందమామతో పోలుస్తూ ఊహాలోకంలో విహరింపజేస్తారు.  సంతోషంలో ముంచెత్తుతారు.  కానీ, ఈ బిజినెస్​ మాన్ ఏం చేశాడో తెలిస్తే అవాక్కవుతారు.  వీరి ముచ్చట చదివితే మీరూ హ్యాపీగా ఫీలవుతారు..

చంద్రుని అందచందాలతో మహిళలను వర్ణించడం అనేది చాలా జంటలు చేస్తుంటాయి. నేటికీ ప్రజలు తమ పార్టనర్​ ఆనందం కోసం నక్షత్రాలను తీసుకువస్తామని వాగ్దానం చేస్తుంటారు. అయితే వడోదరకు  చెందిన హేమాలి పటేల్‌కి ఆమె కాబోయే భర్త మయూర్ పటేల్ చంద్రునిపై ఒక ఎకరం భూమిని ఆమె పేరు మీద రాసిచ్చాడు. ఇది కేవలం ఆప్యాయతతో కూడిన విషయం మాత్రమే కాదు.. ఇంజనీర్‌గా పనిచేస్తున్న హేమాలికి రెండున్నరేళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత ఈ ఏడాది (ఫిబ్రవరి 27న) మయూర్‌తో నిశ్చితార్థం జరిగింది.

కాబోయే భర్త తనకు డైమండ్ రింగ్ లేదా బంగారు హారాన్ని బహుమతిగా ఇస్తాడని ఆశించిన హేమాలి తన పేరు మీద ఏకంగా చంద్రుడిపై కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన యాజమాన్య పత్రాన్ని మయూర్ అందించి.. తనను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ‘‘స్వర్గపు శరీరానికి హేమాలి యజమాని’’ అని రాతపూర్వక పత్రం అందించినప్పటికీ ఆ జంట తమ యాజమాన్యాన్ని డిజిటల్ ఆస్తిగా మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది.

‘ది ఔటర్ స్పేస్ ట్రీటీ ఆఫ్ 1967’ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం మానవజాతి సాధారణ వారసత్వంగా పేర్కొంటూ ఏదైనా ఖగోళ వస్తువుపై దావా వేయకుండా ఉండేందుకు నిషేధం ఉంది. అయినప్పటికీ తనకు కాబోయే భర్త చేసిన ఈ పనికి గట్టిగా హత్తుకుని ముద్దులతో ముంచెత్తింది హేమాలి. మయూర్​  చేసిన ఈ పని తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెబుతోంది ఈ అమ్మడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement