Sunday, April 28, 2024

బిబి 3లో బాలయ్య లుక్ ఇదే? ఇలా ఎప్పుడూ చూసుండరు !!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా బిబి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ రోర్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో అఘోరాగా బాలయ్య కనిపించబోతున్నాడంటూ సినిమా చేసినప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే అఘోర అంటే బూడిద పూసుకొని ఉండేలా కాకుండా డిఫరెంట్ లుక్ లో బాలయ్యని చూపించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. కాగా తాజాగా బిబి 3 సెట్ లో హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకున్న బాలయ్య ఓ చిన్న పాప తో రంగులు పూ యించుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో బాలకృష్ణ ఇదివరకు ఎప్పుడూ కనిపించని లుక్ లో కనిపించాడు. ఇదే లుక్ ను బిబి3 సినిమాలో కూడా బాలకృష్ణ కనిపించబోతున్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి అది నిజమో కాదో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement