Friday, May 3, 2024

ఆ బ్యాగులతో సంబంధం లేదు: టీటీడీ

మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో పోలీసులు సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ తన వద్ద ఉన్న తలనీలాలను ఈ ఫ్లాట్ ఫార్మ్ ద్వారా అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తుందని తెలిపింది. టెండర్ లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్ నుంచి జీఎస్టీ కట్టించుకుని తలనీలాలు అప్పగిస్తామని వివరించారు. కొనుగోలు చేసిన బిడ్డర్ కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులు ఉన్నాయా? లేక దేశంలోనే ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదని స్పష్టం చేసింది. దేశంలోని అనేక ఆలయాలలో తలనీలాల విక్రయాలు జరుగుతూ ఉంటాయని, అలాగే టీటీడీ కూడా ప్రతి మూడు నెలలకోసారి ఈ టెండర్ ద్వారా తలనీలాలు విక్రయిస్తుందని వివరించింది. సంబంధిత అధికారులు తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతామని టీడీపీ అధికారులు చెప్పారు.

ఇదిఇలా ఉంటే.. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తలనీలాల బ్యాగులతో ఉన్న ఓ వాహనాన్ని మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. చైనాకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులో 120 బస్తాల వెంట్రుకలు దొరికాయి. వీటి విలువ రెండు కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement