Tuesday, April 13, 2021

అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై పోలీస్ కేసు – కారణం తెలుసా ?

అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అర్ధరాత్రి సమయంలో బాణసంచా కాల్చినందుకు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ తో పాటు మరో అభిమాని సంతోష్ పై జూబ్లీహిల్స్ పోలీసులు సెక్షన్ 290 336 188 కింద కేసులు నమోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 68 లోని అల్లు అర్జున్ నివాసానికి వందలాది మంది అభిమానులు చేరుకున్నారు. అనుమతులు లేకుండానే బాణా సంచా కాల్చారు. అంతే కాకుండా చుట్టుపక్కల వారికి ఆ సౌకర్యం కలిగించారు.

దీంతో చుట్టుపక్కలవారు డైల్ 100 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ మరో అభిమాని సంతోష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News