Saturday, April 27, 2024

రజినీకాంత్ కాంత్ కు ఎదురెళ్తున్న బాలయ్య !!

నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ టీజర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అభిమానులను అలరిస్తోంది.ఇప్పటికీ 30 మిలియన్ల వ్యూస్ మార్కును క్రాస్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు 35 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది.

కాగా దక్షిణాదిలో సీనియర్ స్టార్ హీరోస్ లో అత్యధిక వ్యూస్ సాధించిన రజిని కబాలి టీజర్ రికార్డ్ బ్రేక్ చేసే దిశ గా బాలయ్య అఖండ టీజర్ ఇప్పుడు దూసుకెళ్తోంది. కబాలి టీజర్ కు 37 మిలియన్ల వ్యూస్ రాగా బాలయ్య టీజర్ కి 35 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మరోవైపు ఇంకో రెండు మిలియన్ వ్యూస్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి బాలయ్య టీజర్ మాత్రం సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement