Tuesday, April 30, 2024

హీరోగా 30ఏళ్లు.. అజిత్ బ‌ర్త్ డేకి ఏకే62 అప్ డేట్

త‌మిళ స్టా్ హీరో అజిత్ హీరోగా 30ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అమరావతి సినిమాతో హీరోగా తొలి సినిమా చేశారు స్టార్ న‌టుడు అజిత్. ఇక అదే ఏడాది ప్రేమ పుస్తకంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వాలి, ప్రియురాలు పిలిచింది, గ్యాంబ్లర్ వంటి సినిమాల‌తో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే అజిత్‌ అంతగా తెలుగు మార్కెట్‌పై మక్కువ చూపలేదు. దాంతో ఆయన సినిమాలు రెండు కోట్లకు మించి కలెక్షన్‌లు సాధించిన దాఖలాలు లేవు. ఈ ఏడాది భారీ స్థాయిలో రిలీజైన తెగింపు సైతం కోటిన్నర కలెక్షన్‌లతో సరిపెట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే సోమవారం అజిత్‌ బర్త్‌డే సందర్భంగా తన తదుపరి సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ రానున్నట్లు తెలుస్తుంది. అజిత్‌ తన తదుపరి సినిమాను మగిజ్‌ తిరుమేనితో చేస్తున్నాడు. తడం, కలగ తలైవాన్‌ వంటి యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలు తెరకెక్కించిన మగిజ్‌.. అజిత్‌తో నెక్స్ట్‌సినిమా చేస్తుండటంతో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. కాగా సోమ‌వారం అజిత్‌ బర్త్‌డే సందర్భంగా ఏకే62 మూవీ టైటిల్‌ను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే అజిత్‌ అభిమానులకు సోమవారం డబుల్‌ ధమకానే.

Advertisement

తాజా వార్తలు

Advertisement