Tuesday, May 21, 2024

హిందీ బిగ్ బాస్14 టైటిల్ విన్నర్ గా..

హిందీ బిగ్ బాస్14 విన్నర్ గా రుబీనా దిలేక్ నిలిచింది. రన్నరప్ గా రాహుల్ వైద్య నిలిచారు. బిగాబాస్14 ఫినాలే కార్యక్రమం చాలా గ్రాండ్ గా సాగింది. హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన డ్యాన్స్ లతో అలరించగా ఒకప్పటి బాలీవుడ్ హీ మాన్ గా గుర్తింపు పొందిన ధర్మేంద్ర ఫినాలేలో సందడి చేశారు. స‌ల్మాన్, ధ‌రేంద్ర సంద‌డి ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని అందించింది. ఇక బిగ్‌బాస్ 14 గ్రాండ్ ఫినాలే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌లో    రాఖీ సావంత్, రుబినా దిలేఖ్, రాహుల్ వైద్య, నిక్కి తంబోలి, ఎలి గోని పోటీ పడ‌గా, ముందుగా రాఖీ సావంత్.. రూ. 14 లక్షలు తీసుకొని షో నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత ఎలీ గోనీ, నిక్కి తంబోలి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. రుబీనా దిలేక్‌ను స‌ల్మాన్ విజేత‌గా ప్ర‌క‌టించ‌గా,  రాహుల్ వైద్య మాత్రం రన్నరప్‌గా నిలిచారు. ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే బిగ్ బాస్ సీజ‌న్ 14 విజేత రుబీనా త‌న భ‌ర్త అభిన‌వ్ శుక్లాతో క‌లిసి హౌజ్‌లోకి అడుగుపెట్టింది. తొలి రోజు నుండి త‌న‌దైన శైలిలో సంద‌డి చేస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షించింది రుబీనా. ఫినాలే కొద్ది రోజుల ముందు అభిన‌వ్ ఎలిమినేట్ కాగా, రుబీనా మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉండి గేమ్‌ని ఆడింది. చివ‌ర‌కు విజేత‌గా నిలిచింది.  రుబినా దిలేక్‌కు సల్మాన్ ఖాన్ రూ. 36 లక్షల ప్రైజ్ మనీ అందజేసాడు. ఈమె బిగ్‌బాస్ హిందీ టైటిల్ గెలుచుకున్న ఆరో మహిళగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement