Monday, May 20, 2024

స్వీటీ..నువ్వెందుకింత క్యూటీ..

సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఉప్పెన సినిమాతో  హీరోయిన్ గా హల్ చల్ చేస్తోంది కృతిశెట్టి. ఆ చిత్రం హిట్ అయింది. కృతికి ఎనలేని ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఈ బ్యూటీ. మంగళూరుకి చెందిన ఈ భామ గతేడాది ఫాదర్స్ డే రోజున ఈ పిక్ ను షేర్ చేసింది. అప్పట్లో ఈమెకి క్రేజ్ లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు.ఉప్పెన చిత్రం హిట్ అవ్వడంతో  ఇప్పుడు మాత్రం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.తండ్రి పక్కన నిలబడి స్మైల్ ఇస్తున్న ఈ అమ్మడు అప్పటి నుంచే క్యూట్ గా ఉంది. దీంతో.. ‘స్వీటీ.. నువ్వెందుకింత క్యూటీ’ అని పాట పాడేస్తున్నారు యూత్. కాగా.. ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్న ఈ కన్నడ సోయగం.. భారీ ఆఫర్లతో గాల్లో తేలిపోతోంది. ప్రస్తుతం నాని ‘శ్యామ్ సింగరాయ్’లో నటిస్తున్న కృతి.. ఇంకా పేరు పెట్టని సుధీర్ బాబు సినిమాకు కూడా సైన్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement