Thursday, May 16, 2024

న్యూఢిల్లీ : ఆరోగ్య రక్షణకు చతుర్ముఖ వ్యూహం :మోడీ

ఆరోగ్యవంతమైన భారతదేశం లక్ష్యం కోసం ప్రభుత్వం చతు ర్ముఖ వ్యూహంతో పనిచేస్తున్నది. నాలుగు విధానాల్లో అస్వస్థత ను నివారించడం, వెల్‌నెస్‌ను ప్రోత్సహించడం మొదటిది. స్వచ్‌ భారత్‌ అభియాన్‌, యోగా, గర్భవతులకు, బాలలకు సంరక్షణ, చికిత్స అందించడం ఇందులో భాగం. రెండవది.. నిరుపేదలకు చౌకైన, ప్రభావవంతమైన చికిత్సను అందించడం. ఆయుష్మాన్‌ భారత్‌, జన్‌ ఔషధి కేంద్రాల ఏర్పాటు ఈ దిశగా పనిచేస్తున్నాయి. మూడవది ఆరోగ్యరంగ మౌలిక సదుపాయాల నాణ్యతను, నిపు ణుల వాసిని పెంచడం. గత ఆరేళ్లలో ఐఐఎంఎస్‌ వంటి సంస్థల ను విస్తరించడం, దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల సంఖ్యను పెంచ డం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం జరగుతోంది. ఇక నాలుగవది అవరోధాలను అధిగమించడానికి ఉద్యమతరహా కార్యాచరణ. మిషన్‌ ఇంధ్రధనుష్‌ను దేశంలోని ఆదివాసీ ప్రాంతాలకు వర్తింపజేయడం ఇందులో భాగమేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement