Wednesday, May 15, 2024

వచ్చే జన్మలో కుక్కలా పుడతా: ఆర్జీవీ


సంచలనాల వర్మ ఇప్పుడు మరో ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. వచ్చే జన్మలో కుక్కలా పుట్టాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టాడు. ఇదేంటి ఆర్జీవీకి సడెన్‌గా అలా ఎందుకు అనిపించిందని ఆలోచిస్తున్నారా..? అదేం లేదండి మనోడి బుర్రలో ఎప్పుడు ఏదో పురుగు మెసులుతూనే ఉంటుంది కదా.. ఇప్పుడు ఓ కుక్క పిల్ల మనోడిని ఫిదా చేసిందండి. అయితే అది సాధారణ కుక్కపిల్ల కాదు…హైదరాబాద్‌ మేయర్‌ గారి కుక్క పిల్ల. మేయర్‌ ఇంట్లో కుక్క అంటే మాములు విషయమా దానికి ఉండే మర్యాదలు అన్ని ఇన్ని కాదు. అంతేనా స్వయంగా మేయర్‌ గారే దానికి తినిపిస్తున్నారు. ఆ వీడియోను మేయర్‌ గద్వాల లక్ష్మీ ట్విట్టర్‌‌లో పోస్టు చేసింది. ఇంకేంముంది అది మనోడి కంట్లో పడింది…ఆ వీడియో చూసినప్పటి నుంచి ఎలాగైనా వచ్చే జన్మలోనైనా కుక్కగా పుట్టాలనేది తన కోరిక అంటూ అదే పనిగా జపం చేస్తున్నాడు.

ఇంతకి ఏం జరిగిందంటే..?
హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ ఓ వీడియోను ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది. అందులో తన పంపుడు కుక్కకి కుడి చేతితో తినిపిస్తూ…తాను మాత్రం ఎడమ చేతితో తింటుంది. ఇది వర్మ కంట్లో పడింది. ఇంకేం ఓ రేంజ్‌‌లో సెటైర్లు వేశాడు. సెల్ఫ్‌ లెస్‌ లవ్‌‌కి ఇది నిదర్శనం అంటూ ప్రారంభించాడు. హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ తన పెంపుడు కుక్కకి కుడి చేతితో తినిపిస్తూ తాను మాత్రం ఎడమ చేతితో తింటోందని…ఆమేను ఇంటర్నేషనల్‌ మేయర్‌ని చేయాలని అంటూ దండం పెట్టాడు. కుక్కల్ని ప్రేమించే మేయర్‌ ప్రజలను ఎలా ప్రేమిస్తుందో అంటూ వ్యగ్యంగా ట్వీట్‌ చేశాడు. అంతేకాదు తాను కూడా వచ్చే జన్మలో కుక్కలా పుట్టాలని ఉందని.. మేయర్‌ ప్రేమను పొందాలని ఉందంటూ సంచలన కామెంట్స్‌ చెశాడు. వర్మ షేర్‌ చేసిన వీడియోను నెటిజన్లు తలో విధంగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement