Monday, April 29, 2024

‘మోసగాళ్ళ’కి పలు భాషల్లో టైటిల్స్ ..

మోసగాళ్ళు చిత్రానికి పలు  భాషల్లో టైటిల్స్ పెట్టేశారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఏవీఏ ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో విష్ణు సోదరిగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించగా.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించారు. వాస్తవ ఘటనల ఆధారంగా ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ ను ఈ చిత్రం ద్వారా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు.. తమిళం.. మలయాళం.. కన్నడ.. హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర భాషల్లో ‘మోసగాళ్ళు’ చిత్రానికి సంబంధించిన టైటిల్స్ ని కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమిళ్ – కన్నడ – హిందీ భాషల్లో ”అను అండ్ అర్జున్” అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇక మలయాళంలో ”అర్జున్ అండ్ అను” అనే టైటిల్ ని పెట్టారు. కాగా ఈ చిత్రంలో రుహీ సింగ్ హీరోయిన్ గా నటించగా.. నవీన్ చంద్ర – నవదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చగా.. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ని భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు. 

Previous article
Next article
Advertisement

తాజా వార్తలు

Advertisement