Sunday, May 5, 2024

మడ్డీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ‘విజయ్ సేతుపతి’

డాక్టర్ ప్రగల్ భల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రం మడ్డీ. ఆఫ్ రోడ్ మడ్ రేసింగ్ క్రీడల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో యువన్.రిధాన్ కృష్ణ, అనూష సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమ కృష్ణదాస్‌ నిర్మాత. ఈ చిత్ర  టైటిల్‌ లోగో, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను తమిళ నటుడు విజయ్‌సేతుపతి విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మడ్‌ రేసింగ్‌ ఆటకు కుటుంబ విలువలు, ప్రేమ, వినోదం అంశాలను జోడించి సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఆటలో రెండుజట్ల మధ్య పోరు వ్యక్తిగత శత్రుత్వానికి ఎలా దారితీసిందనే పాయింట్‌తో ఆసక్తిని  కలిగిస్తుంది. మడ్‌ రేసింగ్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సంభ్రమాశ్చర్యలకు లోనుచేస్తాయి.  ఐదేళ్లు ఈ ఆటపై పరిశోధన చేశాం. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం, కె.జి.రతీష్‌ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement