Thursday, April 25, 2024

న్యూఢిల్లీ : బీమా ప్రైవేటీకరణ

కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ లేదా యూనైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌లో ఏదో ఒకదాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం. క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌ తరువాత.. వీటి ఆర్థికపరమైన రంగంలో కొంత మెరుగుదల కనిపించిందని దీనికి సంబం ధించిన కొందరు అధికారులు చెప్పుకొచ్చారు. ఆర్థికంగా మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం.. మరో రూ.3వేల కోట్లు పబ్లిక్‌ సెక్టార్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో వేసేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత త్రైమాసికంలోనే దీని ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, చెన్నైకు చెందిన యూనైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలు.. మెరుగైన ఆర్థిక వ్యవస్థల కారణంగా.. ప్రైవేటు రంగం నుంచి ఆదరణ పొందుతున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటీకరణ కోసం సరైన కంపెనీ కోసం ప్రభుత్వం చూస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అయితే సరైన కంపెనీ ఎంచుకు నేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రైవేటీకరణ జాబితాలో న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో ప్రభుత్వ వాటా 85.4 శాతంగా ఉంది. నీతి ఆయోగ్‌ ప్రైవేటీకర ణ కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని.. ప్రైవేటైజేషన్‌ అండ్‌ డిపార్‌ ్టమెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపం) దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటుంది. రెండు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులతో పాటు ఓ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని ప్రైవేటు పరం చేస్తామని.. 2021-22 బడ్జెట్‌ సందర్భంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో.. ఎల్‌ఐసీకి సంబంధించిన ఐపీఓ, ఐడీబీఐ బ్యాంకులో మిగిలిన వాటా అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement