Wednesday, May 1, 2024

న్యూఢిల్లీ : మయన్మార్ ప్రదర్శనలపై ఉక్కుపాదం సరికాదు : ఐరాస

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు శనివారం రక్తసిక్తంగా మారడా న్ని ఐక్యరాజ్యసమితి ఖండించింది. అక్కడి సైనిక పాలకులు ఆందోళనకారుల్ని అణచివేసేందుకు వారిపై ఉక్కుపాదం మోపడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐరాస కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆదివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. మయన్మార్‌లోని మాండలేలో శనివారం ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరిపారు. ఈ ఘటన లో ఇద్దరు మరణించగా, 40 మంది గాయపడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ‘మయన్మార్‌లో సైనిక పాలన కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పౌరులపై పాలకులు #హం సాత్మక విధానాల్ని ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నాం. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిని బెదిరింపు లకు గురిచేయడం, వేధించడం ఆమోదనీయం కాదు. శాంతి యుతంగా నిరసనలు తెలిపే #హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. అన్నిపార్టీలు ఎన్నికల ఫలితాలను గౌరవించి. తిరిగి పౌర పాలన నెలకొనేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని గుటెరస్‌ ట్వీట్‌లో వెల్లడించారు.
సైనిక ఖాతాను తొలగించిన ఫేస్‌బుక్‌!
మయన్మార్‌లో కొనసాగుతున్న #హంసాత్మక పరిస్థితులపై సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ స్పందించింది. మాండలే నగరంలో #హంసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశ మిలిట రీకి సంబంధించిన అధికారిక పేజీని ఫేస్‌బుక్‌ తొలగించింది. నిబంధనలను మిలిటరీ పదేపదే ఉల్లంఘిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలి పింది. మా అంతర్జాతీయ విధానాలకు మేం కట్టుబడి ఉన్నాం. #హంసను ప్రేరేపిస్తూ మా కమ్యూనిటీ ప్రమాణాలను పదేపదే ఉల్లంఘిస్తున్నందున.. ‘టాట్మడా ట్రూ న్యూస్‌ ఇన్‌ ఫర్మేషన్‌ టీం’ అనే పేరుతో ఉన్న మిలిటరీ పేజీని ఫేస్‌బుక్‌ నుం చి తొలగిసున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement