Monday, April 29, 2024

‘బన్నీ’ అంటే చాలా ఇష్టం..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని తెలిపింది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ వివరాలు. యంగ్ హీరో నితిన్ తో చెక్ సినిమాలో కలిసి నటిస్తోంది ప్రియ. ఈ చిత్రానికి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడింది.   అల్లు అర్జున్‌‌కు కేరళలో భారీ స్థాయిలో అభిమానులున్నారు. నేను చిన్నప్పటి నుంచి బన్నీ సినిమాలు చూస్తూనే పెరిగాను. బన్నీ అంటే నాకెంతో అభిమానం. బన్నీ సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చిందని, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదు. ఒకవేళ బన్నీ పక్కన నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement