Monday, April 29, 2024

ప‌ఠాన్ త‌ర్వాత జ‌వాన్..

ఈ ఏడాది జనవరి ‘పఠాన్‌ ‘ సినిమాతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు నెలకొల్పారు బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌. ఇప్పుడు మరోసారి ‘జవాన్‌గా అలరించటానికి సిద్ధమయ్యారు. మాస్‌ అండ్‌ కమర్షియల్‌ సినిమాలను తెరకెక్కించటంలో తనదైన ప్రత్యేకతను చాటు-కున్న దర్శకుడు అట్లీ- దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జవాన్‌ సినిమాను విడుదల చేస్తున్నట్లు- నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో ఓ మాస్క్‌ ధరించిన హీరో పదునైన ఈ-టె-ను పట్టు-కుని ఎగురుతున్నాడు. పోస్టర్‌ను గమనిస్తుంటే మరోసారి షారూఖ్‌ మాస్‌ అండ్‌ ఇన్‌-టె-న్స్‌ క్యారెక్టర్‌తో ఆకట్టు-కోనున్నారని స్పష్టమవుతుంది. షారూఖ్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. నయనతార ఈ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ- ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌, -టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో సినిమాపై అంచనాలు పెరిగాయి. అనిరుద్‌ రవిచందర్‌ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement