Thursday, May 9, 2024

దర్శకుడితో వివాహం నిజమేనా..

హీరోయిన్  అను ఎమ్యాన్యుయేల్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధ‌మైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆక్సీజ‌న్ సినిమా ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ‌తో అను ఎమ్యాన్యుయేల్ డేటింగ్‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా,  త్వ‌ర‌లోనే అత‌నితో ఏడ‌డుగులు వేయ‌నుందని సమాచారం .ఏఎం ర‌త్నం కుమారుడు అయిన జ్యోతికృష్ణ‌కు, అను ఎమ్మాన్యుయేల్‌కు ఆక్సీజ‌న్ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ప్రేమ పుట్టింద‌ట‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు డేటింగ్‌లో ఉన్న‌ట్టు టాక్ వినిపిస్తుంది.  ‘యాక్షన్‌ హీరో బైజు’ చిత్రంతో తెరంగేట్రం చేసిన అను ఎమ్మాన్యుయేల్ తెలుగులో అఖిల్ స‌ర‌స‌న మ‌జ్ను అనే చిత్రం చేసింది.  నాగ చైత‌న్య స‌ర‌స‌న  ‘శైలజా రెడ్డి అల్లుడు , బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన ‘అల్లుడు అదుర్స్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న అజ్ఞాత‌వాసి వంటి చిత్రాల‌లో  నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు శర్వానంద్‌, సిద్దార్థ్‌ కలిసి నటిస్తున్న ‘మహాసముద్రం’లో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement