Saturday, April 27, 2024

తెలుగులో మరో బయోపిక్‌..!

తెలుగులో బయోపిక్‌ ల ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌, సావిత్రీ లపై బయోపిక్‌ లు వచ్చాయి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఆశించించి స్థాయిలో ఆడకపోయినప్పటికి, సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి మాత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరో లెజెండరీ నటీ బయోపిక్‌ రానున్నట్లు తెలుస్తోంది. అలనాటి నటి జమున జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రానుందట. జమున మంచి నటే కాదు మంచి డ్యాన్సర్‌ కూడా. ఇప్పుడు ఇదే విషయం ఫిల్మ్‌ సర్కిల్స్‌ లో హాట్‌ టాపిక్‌ మారింది.

డైరెక్టర్‌ శివనాగు నర్ర ఇప్పటికే జమున బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. జమున ఎన్టీఆర్‌, ఏఎన్‌ర్‌, శోభన్‌ బాబు లతో నటించింది. అన్ని సరే కాని ఇంతకు జమున పాత్రలో ఒదిగిపోయే నటీ ఎవరా అని అందరూ ఆలోచిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement