Tuesday, March 26, 2024

సోడాలు కొట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన చిత్రం నీది…మంత్రి అనిల్

ఏపీలో రాజకీయం రగులుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమ పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టులో 185 మీటర్ల మేర డయాఫ్రం వాల్ నిర్మాణం దెబ్బతిందని ఆ విషయాన్ని పీపీఏ దృష్టికి తీసుకెళ్లామని అయినప్పటికీ పిచ్చపిచ్చగా మాట్లాడితే ఉమకి పగులుద్ది అంటూ కామెంట్ చేశారు. బీసీలకు జగన్ మంత్రి పదవి ఇస్తే గొడ్లు కాసుకునే వాడని ఉమా విమర్శిస్తాడు. ఆడా మగా కాని ఉమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు మంత్రి.

సోడాలు కొట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర దేవినేని ఉమదని విమర్శించారు. ఓ పనిని ఎంత త్వరగా చేశామని కాదు ఎంత బాగా చేశారు అనేది లెక్క. ఇకపై జగన్ గురించి ఏమైనా మాట్లాడితే పరిణామాలు ఇంకోలా ఉంటాయని హెచ్చరించారు. అసెంబ్లీలో పోలవరం నిర్మాణంపై లెక్కలతో సహా చెప్పాను. అప్పుడు సమాధానం చెప్పలేని టిడిపి నేతలు ఇప్పుడు ఎదో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ పేపర్ పంపుతా దేవినేని ఉమ పదినిమిషాలు చదవగలరా అంటూ పంచ్ డైలాగ్ లు వేశారు అనిల్ కుమార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement