Saturday, April 27, 2024

తెలంగాణ యాసలో మాట్లాడనున్న ‘కృతిశెట్టి’

హీరోయిన్ కృతిశెట్టి హైదరాబాదీ అమ్మాయిగా కనిపించనుందట.   తాజాగా ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ డైరెక్ష‌న్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందీ బ్యూటీ. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఈ ప్రాజెక్టుకు ఫైన‌ల్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో రౌండప్ చేస్తుంది. ఈ చిత్రంలో హైద‌రాబాదీ అమ్మాయి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని లేటెస్ట్ టాక్‌. ఈ మూవీలో బేబ‌మ్మ‌ తెలంగాణ యాస‌లో మాట్లాడబోతుంద‌ట‌. క్యూట్ క్యూట్ గా త‌న లుక్‌తో అల‌రించిన కృతిశెట్టి..ఈ సారి తెలంగాణ మాండ‌లికంలో డైలాగ్స్ చెప్తూ త‌న‌లోకి మ‌రో యాంగిల్‌ను కూడా ఆడియెన్స్ కు ప‌రిచ‌యం చేయ‌బోతుంద‌న్న‌మాట‌.ఈ మూవీలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కల్యాణీ నటరాజన్, అవసరాల  శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌, రాహుల్‌రామకృష్ణ కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement