Sunday, May 19, 2024

టైగర్ ష్రాఫ్ కి జోడీగా

బాలీవుడ్ నటుడు  టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా తెర‌కెక్క‌బోతున్న బాఘీ 4 చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ ఆఫ‌ర్ కొట్టేసిందట హీరోయిన్ సారా ఆలీఖాన్. ఇప్పుడిదే  బీటౌన్ లో హాట్ టాపిక్‌గా మారింది. టైగ‌ర్‌ష్రాప్ న‌టించిన హీరోపంతి 2 చిత్రంలో సారా అలీఖాన్ న‌టించాల్సింది. కానీ సాజిద్ న‌దియావాలా ప‌లు కార‌ణాల వ‌ల్ల సారా ప్లేస్‌లో తారా సుటారియాను ఎంపిక చేశాడు.సారాకు ఇచ్చిన మాట ప్ర‌కారం సాజిద్ న‌దియావాలా  బాఘీ 4లో హీరోయిన్ గా అవ‌కాశ‌మిచ్చాడు. బాలీవుడ్ లో మోస్ట్ యాక్ష‌న్ ప్రాంఛైజీలో బాఘీ ఒక‌టి. బాఘీ 1, బాఘీ 3 చిత్రాల్లో శ్ర‌ద్దాక‌పూర్ హీరోయిన్ గా న‌టించింది. బాఘీ 2లో దిశాప‌టానీ హీరోయిన్ గా న‌టించ‌గా..ఈ సారి సారా అలీఖాన్ ఆ ఛాన్స్ కొట్టేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement