Sunday, May 5, 2024

జాక్ పాట్ కొట్టిన ‘వైష్ణవ్ తేజ్’

హీరో వైష్ణవ్ తేజ్ జాక్ పాట్ కొట్టాడు. తన ఫస్ట్ చిత్రమే హిట్ట్ అవ్వడంతో మాంచి జోష్ లో ఉన్నాడు. ఉప్పెన సినిమా మ‌న్‌డే టెస్ట్ కూడా పాస్ అయిపోయింది. నాలుగో రోజు కూడా ఈ చిత్రం సంచలన వసూళ్లు సాధించింది. సాధారణంగా వీకెండ్ అయిపోయిన తర్వాత వీక్ డేస్ మొదలైతే కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ ఉంటుంది. కానీ ఉప్పెన విషయంలో మాత్రం అలాంటిది కనిపించడం లేదు. ఆదివారంతో పోలిస్తే దాదాపు 40 శాతం కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కానీ సోమవారం పరంగా చూసుకుంటే మాత్రం అద్భుతమైన వసూళ్లే. నాలుగో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లకు పైగా.. వరల్డ్ వైడ్ గా 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఉప్పెన. ఈ దూకుడు చూస్తుంటే ఉప్పెన కలెక్షన్స్ ఉప్పెన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు వరల్డ్ వైడ్ గా 4 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ ..వరల్డ్ వైడ్ 4 రోజుల మొత్తం – 32.15 కోట్లు షేర్ (56.30 కోట్లు గ్రాస్)

Advertisement

తాజా వార్తలు

Advertisement