Sunday, December 8, 2024

మళ్లీ వాళ్లు వస్తే సమైక్యమే… మంత్రి గంగుల..

కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ నియోజకవర్గం లోని కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో సర్పంచ్ జ్యోతి కి మొదటి సభ్యత్వమిచ్చి ప్రారంభించారు మంత్రి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ . ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఎన్ని భాణాలు వ‌చ్చినా టిఆర్ ఎస్ ను ఏమీ చేయ‌లేవ‌ని అన్నారు.. వైఎస్ షర్మిల పార్టీపై స్పందిస్తూ, జగనన్న బాణం షర్మిల వస్తోందని.. తర్వాత మెల్లగా జగన్ వస్తాడని, జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవని, కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని, లేకపోతే సమైక్య రాష్ట్రం అవుతుందని హెచ్చరించారు. ఆంధ్రా నేతలు కరెంటు, నీళ్లు ఎత్తుకపోతారని, కేసీఆరే రక్షకుడని గంగుల అన్నారు. అందుకే అంద‌రూ టిఆర్ ఎస్ పార్టీని బ‌ల‌ప‌ర‌చాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement