Thursday, April 25, 2024

మాస్ ఎలిమెంట్స్ తో ‘రాబర్ట్’..హ్యాపీ బర్త్ డే ‘దర్శన్’

రాబర్ట్ చిత్రం నుండి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. నేడు ఫ్రిబ్రవరి 16న హీరో దర్శన్ పుట్టినరోజు.   ద‌ర్శ‌న్ క‌థానాయ‌కుడిగా ఉమాప‌తి ఫిలింస్ బ్యాన‌ర్‌పై త‌రుణ్ కిషోర్ సుధీర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉమాప‌తి శ్రీనివాస గౌడ నిర్మిస్తోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాబ‌ర్ట్‌’.  దర్శన్‌ పుట్టినరోజు నేడు(ఫిబ్రవరి 16) ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. “నన్ను అంతం చేయాలనుకున్నవాడు నా కన్నా పెద్ద క్రిమినల్‌ బ్రెయిన్‌ అయ్యుండాలి… నా కన్నా టెర్రర్‌ అయ్యుండాలి.. నా కన్నా వయొలెంట్‌ అయ్యుండాలి.  “మనిషికి రెండుసార్లు వణుకు పుడుతుంది. ఒకటి చలి వేసినప్పుడు.. రెండు బాగా భయం వేసినప్పుడు” అనే డైలాగ్‌తో జగపతిబాబు క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్‌ చేశారు. అలాగే రవికిషన్‌, దేవరాజ్‌, హీరోయిన్‌ ఆశా భట్‌ పాత్రలను ట్రైలర్‌లో చూపించారు.  మాస్‌ ఎలిమెంట్స్‌, ఎమోషన్స్‌, ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్‌ అంశాలు అన్నింటినీ కలగలిపి దర్శకుడు తరుణ్‌ కిషోర్‌ సుధీర్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘రాబ‌ర్ట్‌’ సినిమాను తెరకెక్కించాడని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్‌ మరింత పెంచింది. మార్చి 11న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement