Wednesday, May 15, 2024

చుంచు మామగా ‘జగపతిబాబు’..హ్యాపీ బర్త్ డే

సీనియర్ హీరో  జగపతి బాబు సెకెండ్ ఇన్నింగ్స్‌లో రూటు మార్చారు. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనలోని నటుడిని వెలికి తీస్తున్నారు. జగపతి బాబు నటిస్తున్న తాజా చిత్రం మహాసముద్రం. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి రూపొందిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) జగపతి బాబు జన్మదినోత్సవం. ఈ సందర్భంగా మహాసముద్రం టీమ్ జగపతి బాబు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో జగపతి బాబు చుంచు మామ పాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందెన్నడూ లేని రీతిలో జగపతి బాబు ఊర మాస్ లుక్‌లో కనిపించారు. అదితిరావు హైదరి, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement