Thursday, May 16, 2024

ఎ మూవీని సపోర్ట్ చేస్తోన్న ‘విజయ్ సేతుపతి’

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఎ చిత్రానికి తన సపోర్ట్ తెలిపారు. టాలీవుడ్ లోని ఓ చిన్న సినిమాకు విజయ్ సేతుపతి పెద్ద మనసుతో సపోర్ట్ చేయడం విశేషం. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్లుగా నటించారు. యుగంధర్ ముని ఈ మూవీని తెరకెక్కించారు. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించారు. ఈ  సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన విజ‌య్ సేతుప‌తిని ఇటీవలే ముంబైలో ‘A’ సినిమా చిత్ర బృందం  కలిసి తమ సినిమాకు సపోర్ట్‌గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రంలోని కొంత భాగాన్ని చూసిన విజ‌య్ సేతుప‌తి సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంద‌ని యూనిట్‌ను అభినందించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement