Tuesday, May 14, 2024

ఉమేష్ చంద్రగా ‘సోనూసూద్’

కడప టైగర్ గా పేరు దక్కించుకుని పోలీసు శాఖలో రెబల్ ఆఫీసర్ గా నిలిచిన ఎస్పీ చదలవాడ ఉమేష్ చంద్ర బయోపిక్ తెరకెక్కనుంది.. ఆయన లైఫ్ చాలా సినిమాటిక్ గా ఉంటుందట. సినిమా  హీరో రేంజ్ లో ఆయన సాహసాలు మరియు ఆయన డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపర్చేవట.  ఉమేష్ చంద్ర పాత్రకు గాను రియల్ హీరో ఇమేజ్ దక్కించుకున్న విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సోనూ సూద్ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ కొనసాగుతుంది. కనుక ఇదే మంచి టైమ్ గా భావించి సోనూసూద్ తో ఉమేష్ చంద్ర బయోపిక్ ను తెరకెక్కించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను ఆదుకోవడంతో పాటు వందలాది మంది స్టూడెంట్స్ కు సాయంగా నిలవడంతో పాటు అన్ని విధాలుగా తనకు తోచిన సాయాలు చేస్తూ సోషల్ మీడియాలో రియల్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్న సోనూసూద్ అయితే ఈ పాత్రకు సరిగ్గా సూట్ అవుతాడని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే విలన్ నుండి హీరోగా మారిపోయి ఒకటి రెండు సినిమాలు చేస్తున్న సోనూసూద్ త్వరలోనే ఉమేష్ చంద్ర బయోపిక్ ను కూడా మొదలు పెట్టబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement