Tuesday, April 30, 2024

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’..సుధీర్ బాబు మూవీ టైటిల్..

హీరో సుధీర్ బాబు నటిస్తోన్న కొత్త మూవీకి టైటిల్ ని ఫిక్స్ చేశారు. సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ మూవీ రానుంది. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ. స్టార్ హీరోయిన్లయిన సమంత అక్కినేని – రష్మిక మందన్నా మేనేజర్లు బి.మహేంద్రబాబు – కిరణ్ బాలపల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సుధీర్ బాబు నటిస్తున్న  14వ చిత్రం ఇది. సోషల్ మీడియా వేదికగా ఇంద్రగంటితో చేస్తున్న చిత్రానికి ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే టైటిల్ ని పెట్టినట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆ అమ్మాయి గురించి ముందు ముందు చాలా అంటే చాలా చెప్తానని సుధీర్ పేర్కొన్నారు. . రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చనున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement