Monday, May 20, 2024

‘అల్లు శిరీష్’ రిలీజ్ చేసిన ‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’ థియేట్రికల్ ట్రైలర్

యంగ్ హీరో అల్లు శిరీష్ లవ్ లైఫ్ అండ్ పకోడీ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ నేటి ట్రెండ్ కి అంద్దంపట్టే అంశాలతో తెరకెక్కిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇది. ఈ మూవీద్వారా కార్తిక్ బిమల్ – సంచిత పొనాచ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సమర్పణలో కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించబడింది. జయంత్ గాలి ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రాన్ని మార్చి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అరుణ్ అంటే సూర్యుడు అని.. రేయా అంటే నీటి ప్రవాహం అంటూ హీరో హీరోయిన్లు తమ పేర్లకు అర్థాలు చెప్పుకోవడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.

లవ్ స్టోరీస్ మరియు పకోడీలను హేట్ చేసే ఓ ప్లే బాయ్.. నో కమిట్ మెంట్స్ నో ఎక్సపెక్టేషన్స్ అంటూ రేయా అనే అమ్మాయితో 5 ఏళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత వారి లైఫ్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనేది ఇందులో చూపించారు. నేటితరం యువతీయువకులు ప్రేమ – పెళ్లి విషయాల్లో ఎలా ఆలోచిస్తున్నారు.. ఒక రిలేషన్ షిప్ కి కమిట్ అవడానికి ఎలాంటి కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. నేటి యువతరం ఆలోచనలకు అద్దం పడుతున్న ‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’ టైలర్ యూత్ ని ఆకర్షించేలా ఉంది. ఈ చిత్రానికి పవన్ సంగీతం సమకూర్చారు. సాగర్ వైవీవీ – జితిన్ మోహన్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ వర్క్ చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement