Thursday, May 2, 2024

Yamaha : ప్రీమియం ఆఫ‌రింగ్ తో తెలుగు రాష్ట్రాల్లో వాటా పెంచుకున్న య‌మ‌హా

హైదరాబాద్ : యమహా అత్యంత కీలక మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రధానమైనవని. చాలాకాలంగా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సుగల ఉత్సాహపూరితమైన యువ మోటార్‌ సైక్లింగ్‌ అభిమానులతో తెలుగు రాష్ట్రాలు వర్ధిల్లుతున్నాయని యమహా మోటార్స్‌ ఇండియా(సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) వైస్‌ ప్రెసిడెంట్‌ రవీందర్‌ సింగ్‌ తెలిపారు. ఈ ప్రాంత వినియోగదారులకు యమహా వాహనాల్లో ప్రధానంగా అపూర్వమైన పనితీరు, ప్రీమియం లుక్‌ ద్విచక్ర వాహనాల పట్ల విపరీతమైన అభిమానం ఉందని ఆయన తెలిపారు. ఈ అంశాలే యమహా బ్రాండ్‌ బలమైన వార్షిక వృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని కస్టమర్ల నిజమైన ఆకాంక్షలను తీర్చే డైనమిక్‌ మోడళ్ల విస్తృతశ్రేణితో ఉత్పత్తి శ్రేణిని బలోపేతం చేయడానికి నిరంతరం కృషిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుండి మే వరకు ఈ ప్రాంతంలో యమహా బ్రాండ్‌ 26శాతం వాల్యూమ్‌పరంగా వృద్ధిని సాధించి, గత ఏడాది సాధించిన విజయాలను అధిగమించిందన్నారు.

ప్రీమియం సెగ్మెంట్‌లో 13శాతానికి పైగా మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నామని ఆయన తెలిపారు. 2018లో ప్రారంభించిన నాటి నుండి ది కాల్‌ ఆఫ్‌ ది బ్లూ బ్రాండ్‌ ప్రచారం అత్యంత పోటీతత్వ, సవాల్‌తో కూడిన భారతీయ మార్కెట్లో యమహా ప్రత్యేక గుర్తింపు ఏర్పరచటంలో పెనుప్రభావాన్ని చూపిందన్నారు. ట్రాక్‌ డే, సీవోటీబీ వీకెండ్‌, బ్లూస్ట్రీక్స్‌రైడ్‌, టెస్ట్‌రైడ్‌ ఈవెంట్ల వంటి అనేక కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా వినియోగదారులతో మరింతగా కనెక్ట్‌ అయ్యామని వివరించారు. యమహా బ్లూస్క్వేర్‌ అవుట్‌లెట్ల ద్వారా రిటైల్‌ కార్యకలాపాలు బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రతి వినియోగదారు ఉన్నతమైన కొనుగోలు, యాజమాన్య అనుభవాన్ని అనుభవించేలా ఇది చూస్తుందన్నారు. ఇప్పటి వరకు దేశంలో 197కంటే ఎక్కువ బ్లూస్క్వేర్‌ అవుట్‌ లెట్లను విజయవంతంగా ఏర్పాటు చేశామని, ఈ సంవత్సరం చివరినాటికి మరో 100 అవుట్‌లెట్లను ప్రారంభించనున్నామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 18 బ్లూస్క్వేర్‌ షోరూమ్‌లను కలిగి ఉన్నామని తెలిపారు. మొత్తం ఉత్పత్తి శ్రేణి ఇప్పుడు టీసీఎస్‌(ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌)ను కలిగి ఉందని, ఓబీడీ-2 నిబంధనలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఔత్సాహికుల పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 300సీసీ మోడళ్లను, రాబోయే సంవత్సరాల్లో 700సీసీ నుండి 900సీసీ వరకు మోడళ్లను ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement