Tuesday, April 30, 2024

ఇండియాలో వీవోవై 75 ఆవిష్కరణ.. లేటెస్ట్​ ఫీచర్స్​తో మార్కెట్లోకి

ప్రభన్యూస్ : వినూత్న గ్లోబల్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వివో శుక్రవారం వివో వై75ను లాంచ్‌ చేసింది. భారతదేశంలో తన వై సిరీస్‌ పోర్ట్‌పోలియోను విస్తరించింది. ఇది ప్రీమియం బిల్డ్‌తో అద్భుతమైన సొగసైన డిజైన్‌ ను కలిగి ఉంది. ఆల్‌ న్యూ వివో వై 75 మీడియా టెక్‌ హీలియో జీ96 చిప్‌ సెట్‌తో 44ఎంపీఏఎఫ్‌ సెల్ఫీ కెమెరాతో ఐ ఆటో ఫోకస్‌, 50 ఎంపీ సూపర్‌ నైట్‌ కెమెరాతో వస్తోంది. దీని ధర రూ.20,999లు. ఇది రెండు స్టైలిష్‌ రంగుల్లో లభిస్తుంది.

ప్లిప్‌ కార్ట్‌.కామ్‌, వివో ఇండియా ఈ స్టోర్లలోనూ మే 20నుంచి అన్ని భాగస్వామ్య రిటైల్‌ స్టోర్లలో లభ్యమవుతుందని ఆసంస్థ తెలిపింది. మూన్‌లైట్‌ షాడో, డ్యాన్సింగ్‌ వేవ్స్‌ వినియోగదారులు మే 31 వరకు ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ వన్‌ కార్డ్‌ ఉపయోగించి రూ.1500వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement