Sunday, April 28, 2024

5 రాత్రులు స్టే చేస్తే.. ఒక స్టే ఉచితం అంటున్న ఒయో

ప్రభన్యూస్ : గ్లోబల్‌ హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫారం ఓయో తన వినియోగదారులకు 5 రాత్రుల బస అనంతరం ఉచితంగా ఒకసారి స్టే చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించింది. మహమ్మారి అనంతరం ప్రయాణాలను ఉత్తేజించే లక్ష్యాన్ని ఇది కలిగి ఉంది. ఈసందర్భంగా ఓయో ప్రొడక్ట్స్‌ ఎస్‌.వి.పి. అండ్‌ చీఫ్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ శ్రీరంగ్‌ గోడ్బోలే మాట్లాడుతూ…. ఓయో అది కుటుంబాలు, మిత్రులు, చిన్న వ్యాపారం లేదా పెద్ద కార్పొరేట్‌ ఉద్యోగులకు విలువకు తగిన ప్రాధాన్యత అందించే వినియోగదారులకు సేవలందిస్తుందన్నారు.

తాము మద్ధతు ఇస్తున్న ఉచిత రూమ్‌ నైట్లు-, రాయితీలతో హోటల్‌ గదుల్లో స్టే చేసేవారికి ఓయోను ప్రతిసారీ వినియోగించుకునేలా ప్రేరేపిస్తుందని గుర్తించామన్నారు. క్రమం తప్పకుండా రాత్రుళ్లు స్టే చేసేందుకు గదులు బుక్‌ చేసుకుంటున్న తమ వినియోగదారుల వాటా 2021 మార్చి 31కి ముగిసిన ఏడాదికి 70శాతం వృద్ధి చెందిందన్నారు. మెరుగైన తమ లాయల్టీ ఆఫర్లు ఈ పెద్ద వినియోగదారుల వలయానికి మరింత ఇష్టమవుతాయన్న నమ్మకం తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement