Tuesday, March 26, 2024

హైదరాబాద్‌లో లాక్​ ద బాక్స్​.. మే 26 నుంచి 29 వరకు బుక్​ షో

ప్రభన్యూస్ : ప్రీ ఓన్డ్‌ బుక్స్‌ కోసం ఆన్‌లైన్‌ బుక్‌స్టోర్‌ బుక్‌ చోర్‌ వినూత్నవెున బుక్‌ సేల్‌ను లాక్‌ ద బాక్స్‌ రీలోడెడ్‌ శీర్షికన నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ప్రతి పుస్తకానికీ ధర చెల్లించనవసరం లేకుండా బాక్స్‌కు ధర చెల్లిస్తే, ఆ బాక్స్‌లో పట్టినన్ని పుస్తకాలను వెంట తీసుకువెళ్లవచ్చు. ఇది శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమం ట్రస్ట్‌ వద్ద మే 26 నుంచి మే 29వరకూ జరుగనుంది. ఈ కార్యక్రమంలో 10 లక్షలకు పైగా పుస్తకాలు ఎంచుకునేందుకు అందుబాటు-లో ఉంటాయి. వీటిలో ఫిక్షన్‌, నాన్‌ ఫిక్షన్‌, క్రైమ్‌, రొమాన్స్‌, యువత కోసం పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, ఎడ్వెంచర్‌, సైన్స్‌ ఫిక్షన్‌ వంటివి ఉన్నాయి.

ఓడిస్సీ బాక్స్‌ (ధర రూ.1199లు) , పర్శియస్‌ బాక్స్‌ (రూ.1799లు), హెర్క్యులస్‌ బాక్స్‌ (రూ. 2999లు) ఉంటాయి. ఈ కార్యక్రమం గురించి బుక్‌చోర్‌ ఫౌండర్‌ విద్యుత్‌ శర్మ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో లాక్‌ ద బాక్స్‌ రీలోడెడ్‌ నిర్వహించడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. ఇప్పటికే బెంగళూరు, కోల్‌కతా, పూణ, ఇండోర్‌ లాంటి నగరాల్లో వచ్చిన స్పందన పట్ల తాము ఆనందంగా ఉన్నామని, పుస్తక ప్రేమికులు దాదాపు 10 లక్షల పుస్తకాల నుంచి ఎంచుకోవచ్చన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement