Saturday, May 4, 2024

ఓలా నుంచి కొత్తగా మూడు ఈ-స్కూటర్లు.. త్వరలో మార్కెట్లోకి

ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీ ఓలా మరో మూడు కొత్త స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 15 సందర్బంగా నిర్వహించిన కస్టమర్స్‌ డే కార్యక్రమంలో కొత్త విద్యుత్‌ స్కూటర్లను లాంచ్‌ చేసింది. మూడు స్కూటర్లు ఎస్‌1 సీరి స్‌లో కంపెనీ తీసుకు వచ్చింది. 2కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో ఎస్‌1ఎక్స్‌, 3 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో ఎస్‌1 ఎక్స్‌, ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ పేరుతో వీటిని లాంచ్‌ చేసింది. ఓలా ఇప్పటికే ఎస్‌1 ప్రో, ఎస్‌1 ఎయిర్‌ పేరుతో స్కూటర్లను విక్రయిస్తోంది.

కంపెనీ కొత్తగా లాంచ్‌ చేసిన మూడు విద్యుత్‌ స్కూటర్ల ధరలు లక్షల రూపాయల లోపుగానే ఉన్నాయి. ఓలా ఎక్స్‌1 శ్రేణి స్కూటర్లు రెండు రకాల బ్యాటరీ వేరియంట్లతో వస్తున్నాయి. ఓలా ఎక్స్‌1 ప్లస్‌ స్కూటర్‌ ధర 1.09 లక్షలు. ప్రారంభ ధరగా ఈ స్కూటర్‌ను 99,999 రూపాయలకు విక్రయిస్తామని కంపెనీ ప్ర‌క‌టించింది. ఆగస్టు 21 వరకు ఈ ధర అందుబాటులో ఉంటుందని తెలిపింది. 3 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో వచ్చే ఓలా ఎస్‌1 ఎక్స్‌ ధర 99,999 రూపాయలు.

- Advertisement -

ఈ స్కూటర్‌ను కూడా ఆగస్టు 21 వరకు 10 వేల రూపాయల డిస్కౌంట్‌తో ఇవ్వనున్నారు. 2కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో వచ్చే ఎస్‌1 ఎక్స్‌ మోడల్‌ ధర 89,999 రూపాయలుగా కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌ను ఆగస్టు 21 వరకు 79,999 రూపాయలకు విక్రయిస్తారు. ఎస్‌1 ప్రో సెకండ్‌ జనరేషన్‌ మోడల్‌ ధర 1.47 లక్షలుగా, ఎస్‌1 ఎయిర్‌ ధర 1.19 లక్షలుగా కంపెనీ తెలిపింది.

ఎస్‌1 ఎక్స్‌ శ్రేణి స్కూటర్లలో 5.0 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌, ఎస్‌1 ఎక్స్‌ మేరియంట్‌ స్కూటర్లలో 6 కిలోవాట్‌ మోటార్‌ ఉంటుంది. ఇది 151 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. దీని టాప్‌ స్పీడ్‌ 90 కిలోమీటర్లు. 2కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ఉన్న ఎక్స్‌ స్కూటర్‌ 91 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని తెలిపింది. దీని టాప్‌ స్పీడ్‌ 85 కిలోమీటర్లు. ఎస్‌1 ప్రో సెకండ్‌ జనరేషన్‌ వేరియంట్‌ రేంజ్‌ 195 కిలోమీటర్లుగా కంపెనీ తెలిపింది. దీని టాప్‌ స్పీడ్‌ 120 కిలోమీటర్లు. ఈ స్కూటర్‌ 2.6 సెకండ్లలోనే 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది.

ఓలా నుంచి నాలుగు బైక్‌లు…

ఓలా కంపెనీ మార్కెట్‌లోకి 4 విద్యుత్‌ బైక్‌లను తీసుకు వస్తోంది. కస్టమర్‌ ఈవెంట్‌లో కంపెనీ ఈ నాలుగు కాన్సెప్ట్‌ బైక్‌లను ప్రదర్శించింది. డైమండ్‌ హెడ్‌, అడ్వెంచర్‌, రోడ్‌స్టర్‌, క్రూయిజర్‌ పేరుతో వీటిని తీసుకు రానుంది. వీటి ఫీచర్లు, ధరలు కంపెనీ వెల్లడించలేదు. 2024 చివరి కల్లా విద్యుత్‌ బైక్‌లను తీసుకు వస్తామని ఓలా ప్రకటించింది. ఈ బైక్‌లను మన దేశంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement