Sunday, April 28, 2024

ప్రజల ఆనందం కోసమే వీకెండ్ మస్తి – మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ జిల్లా ప్రజల ఆనందం కోసమే మానేరు వంతేనపై వీకెండ్ మస్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తీగల వంతెనపై ఏర్పాటు చేసిన వీకెండ్ మస్తి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, మానకొండూర్ ఎమ్మెల్యే, మేయర్ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కేవలం జిల్లా ప్రజలకు ఆనందాన్ని అందించే దిశగా మానేరు తీగల వంతెనపై వీకెండ్ మస్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లా ప్రజలకు అభివృద్ది, అద్యాత్మికాన్ని అందించడంతో పాటు వినోదాన్ని పంచుతూ తెలంగాణలో అద్భుతమైన రెండవ జిల్లాగా ప్రగతిని సాధించిందని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం నాటి సాయంత్రం లాంఛనంగా ప్రారంభించుకున్న వీకెండ్ మస్తి కార్యక్రమాన్ని ఇకపై ప్రతి శని, ఆదివారాల్లో కూడా నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కోన్నారు.

జిల్లాకే తలమాణికంగా తీగల వంతేన, మానేరు రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించుకోగా, ఇప్పటికే తీగల వంతేన పనులు పూర్తిచేసుకోని ప్రారంభించుకోగా, రివర్ ఫ్రంట్ పనులు ఇప్పటికే 25 శాతం పనులు పూర్తిచేసుకోవడం జరిగిందని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో బ్యారేజిని ఏర్పాటు చేసుకోని గేట్లద్వారా నీటిని నిలిపి 6నెలల్లో కళ్లముందుకు తీసుకురావడం జరుగుతుందన్నారు. నీటిపై తెలియాడుతూ ఫైర్, లేజర్ షో, సినిమాను ఇంకా అనేక ఎంటటైర్మెంట్ కార్యక్రమాలను అందించే బిగ్ ఓ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇది ప్రపంచంలోనే సియోల్ లోని యోసో, చైనా తరువాత కరీంనగర్ జిల్లాలోని మానేరు రివర్ ఫ్రంట్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించే వీకెండ్ మస్తి కార్యక్రమాన్ని కేవలం ప్రజల ఆనందం కొరకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రాకర్ షో ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఎవరు శృతిమించకుండా వ్యవహరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ డాః బి. గోపి, సిపి సుబ్బారాయుడు, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ జి.వి రామకృష్ణా రావు, కరీంనగర్ ఆర్డిఓ కె. మహేష్, ఇతర ప్రజాప్రతినిధులు,కార్పొరేటర్లు అధికారులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement