Monday, April 29, 2024

రెండేళ్లు వాటా తగ్గదు! ఎల్‌ఐసీ ఐపీఓలో స్పష్టత

న్యూఢిల్లి : దేశీయ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైన తరువాత.. కనీసం రెండేళ్ల వరకు సంస్థలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకోవడానికి అవకాశం లేదు. ఈ మెగా ఐపీఓలో పాల్గొనే ఇన్వెస్టర్లకు నష్టం వాటిల్లవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తన వైఖరిని ఐపీఓపై రోడ్‌ షో సమయంలోనే ఇన్వెస్టర్లకు తెలిపింది. ఎల్‌ఐసీ చట్టంలో సవరణలు చేసిన తరువాత ప్రభుత్వం తన వాటాను 75 శాతం వరకు తగ్గించుకునేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో ఐపీఓ ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వం తన వాటాను తగ్గించుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. దీంతో ఐపీఓ ప్రక్రియ పూర్తి కాగానే.. ప్రభుత్వం తన వాటాను మరింత తగ్గించుకునే అవకాశం ఉందనే వార్తలపై తాజాగా స్పష్టత ఇచ్చింది. ఇది ఇన్వెస్టర్లకు ఎంతో ఊరట ఇచ్చే అంశం. రెండేళ్ల పాటు తన వాటాను విక్రయించుకునేందుకు ప్రభుత్వం ఏమాత్రం సముఖం లేదని చెబుతున్నారు.

అలా చేస్తే కంపెనీ షేర్లపై ఒత్తిడి పెరిగి ఇన్వెస్టర్లు నష్టపోతారని, అందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని అంటున్నారు. పబ్లిక్‌ ఇష్యూ తరువాత కంపెనీ వ్యాల్యూ రూ.1లక్ష కోట్లు దాటితే ఐదేళ్లలోపు ఆ సంస్థలో పబ్లిక్‌ షేర్‌ హోల్డర్ల వాటాను కనీసం 25 శాతం పెంచాల్సి ఉంటుంది. కానీ ఎల్‌ఐసీ విషయంలో ప్రభుత్వం ఇచ్చే ఐదేళ్ల పాటు ఎలాంటి వాటా కుదింపునకు సుముఖంగా లేదు. దీంతో ప్రభుత్వం విషయంలో నియంత్రణ సంస్థల నుంచి మినహాయింపు కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే ఐదేళ్ల కాలంలో పబ్లిక్‌ ఇష్యూ ద్వారా లేదా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో వాటాను తగ్గించుకునే ఉద్దేశం లేదని అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement