Saturday, April 20, 2024

జియో బీపీ-టీవీఎస్‌ డీల్‌.. దేశ వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు

న్యూఢిల్లి : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించిన ఛార్జింగ్‌ స్టేషన్ల విషయంలో చాలా కంపెనీలు పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో జియో బీపీ సంస్థ ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్‌తో జత కట్టేందుకు నిర్ణయించింది. ఎలక్ట్రానిక్‌ వాహన రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ కారణంగా.. దేశ వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు కొలువుదీరనున్నాయి. జియో బీపీ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్స్‌లో టీవీఎస్‌ వాహనాలకు యాక్సెస్‌ లభిస్తుంది. దీని ద్వారా టీవీఎస్‌ ఈవీలలో ప్రయాణం చేయడం మరింత సౌకర్యవంతం అవుతుంది. రిలయన్స్‌ సబ్సిడరీ సంస్థ అయిన జియో బీపీ దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున జియో బీపీ ప్లస్‌ పేరుతో ఛార్జింగ్‌ స్టేషన్లను, బ్యాటరీ స్వాపింగ్‌ సెంటర్లు అందుబాటులోకి తీసుకురానుంది. మరోవైపు ఐక్యూబ్‌ పేరుతో ఇప్పటికే ఈవీ సెగ్మెంట్‌లో అడుగుపెట్టిన టీవీఎస్‌ సంస్థ.. రాబోయే రోజుల్లో రూ.1000 కోట్లను ఈవీ రంగంపై ఖర్చు చేయనుంది. దీంతో భవిష్యత్తులో అవసరాలకు తగట్టుగా జియోబీపీ, టీవీఎస్‌లు జట్టు కట్టాయి.

జియో బీపీ ప్లస్‌ యాప్‌..

సాధారణ ఏసీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌తో పాటు డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం కోసం ఒప్పందం కుదిరింది. ఇది వినియోగదారులకు విస్తారమైన, నాణ్యమైన సేవలు అందిచేందుకు ఎంతో సహకరిస్తుంది. జియో-బీపీ ప్లస్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ యాప్‌ ద్వారా తమకు సమీపంలోని ఛార్జింగ్‌ స్టేషన్లను గుర్తించే అవకాశం లభిస్తుంది. భారతదేశపు అతిపెద్ద ఈవీ నెట్‌వర్క్‌లో ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో.. జియో-బీపీ ఛార్జింగ్‌ ఎకో సిస్టమ్‌ సృష్టించనుంది. ఇది ఎలక్ట్రానిక్‌ వాహన వినియోగదారులందరికీ ఎంతో ప్రయోజం చేకూర్చనుంది. జియో-బీపీ బ్రాండ్‌ కింద పని చేస్తున్న రిలయన్స్‌ బీపీ మొబిలిటీ (ఆర్‌బీఎంఎల్‌) అనేది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌), బీపీ మధ్య భారతీయ ఇంధనాలు, మొబిలిటీ జాయింట్‌ వెంచర్‌ (జేవీ). జాయింట్‌ వెంచర్‌ దేశ వ్యాప్తంగా రిల్‌ ఉనికిని, జియో డిజిటల్‌ ప్లాట్‌ఫాం ద్వారా మిలియన్ల మంది వినియోగదారులను ప్రభావితం చేస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement