Wednesday, May 1, 2024

Gold : ఒక్క‌సారిగా పెరిగిన‌ బంగారం ధ‌ర‌..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు షాక్‌ ఇచ్చాయి. వరుసగా నాలుగు రోజుల పాటు తగ్గిన గోల్డ్ రేట్లు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. వెండి రేట్లు సైతం బంగారం దారిలోనే పెరిగాయి.

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు 10 గ్రాములకు రూ. 100 పెరిగి రూ. 55 వేల 550 కి చేరింది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులానికి రూ. 110 పెరిగి రూ. 60 వేల 600 వద్దకు చేరింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి రేటు రూ. 600 పెరిగి రూ. 76 వేల స్థాయికి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement