Monday, April 29, 2024

ఆల్ట్రోజ్ ఐసీఎన్జీని ప్రవేశపెట్టిన టాటా మోటార్స్

హైదరాబాద్: భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయిన టాటా మోటార్స్, భారత దేశపు మొట్టమొదటి ట్విన్-సిలిండర్ సీఎన్జీ సాంకేతికతతో కూడిన అల్ట్రోజ్ ఐసీఎన్జీ ని రూ.7.55 లక్షల (ఆల్-ఇండియా, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈరోజు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కొనుగోలుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, టాటా మోటార్స్ పరిశ్రమ మొదటి సీఎన్జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది.

ఈ ఆవిష్కరణ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ… వినియోగదారులు ఆర్థిక పర్యావరణ అనుకూల ఉద్దేశ్యంతో ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలను ఎక్కువగా ఎంచుకుంటున్నారన్నారు. ఇంధనంగా సీఎన్జీ దాని విస్తృత లభ్యతతో ఎంతగానో ప్రజామోదం పొందిందన్నారు. ఏదేమైనప్పటికీ సీఎన్జీని ఎంచుకోవడం అంటే ఆశించదగిన లక్షణాలపై రాజీపడడం, బూట్ స్పేస్‌ను గణనీయంగా వదులుకోవడం అనే భావన ఉందన్నారు. జనవరి 2022లో తాము టియాగో, టైగోర్ లలో అధునాతన ఐసీఎన్ జీ సాంకేతికతను ప్రారంభించడం ద్వారా మొదటి రాజీని పరిష్కరించామన్నారు. అత్యుత్తమ పనితీరు, అత్యుత్తమ ఫీచర్లను అందజేస్తున్నామని తెలిపారు. సీఎన్జీ మార్కెట్‌ను పునర్నిర్వచించే విధంగా, బూట్ స్పేస్‌పై ఉన్న ప్రధాన ఆందోళనను పరిష్కరించడం ద్వారా పరిశ్రమలో మొదటి ఆఫర్ అయిన అల్ట్రోజ్ ఐసీఎన్జీ ని ప్రారంభించడం పట్ల తాము సంతోషిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement