Friday, April 26, 2024

నష్టాల్లో ముగిసిన మర్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫ‌లితాల కార‌ణంగా దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈరోజు చివరి రోజు కావడంతో… బ్యాంకుల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. దీనికి తోడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఉద‌యం ట్రేడింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి నష్టాల్లోనే కదలాడిన సూచీలు ఆఖ‌రుకు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. మరోవైపు భారత్ లో ద్రవ్యోల్బణం ఆందోళనకర రీతిలో ఉందని మూడీస్ అనలిటిక్స్ పేర్కొంది. దీంతో, మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లోనే కొనసాగాయి. 50,049 పాయింట్ల వ‌ద్ద ఇవాళ ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్ 627 పాయింట్లు కోల్పోయి 49,509 వద్ద ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement