Friday, May 3, 2024

ఊగిసలాట.. తేరుకుని లాభాల్లో ముగిసిన మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 226 పాయింట్లు ఎగబాకి 52,925 వద్ద ముగియగా.. నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 15,860 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.17 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడాయి.లోహ, బ్యాంకింగ్‌ రంగాల మద్దతుతో పాటు టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ వంటి కీలక కంపెనీలు రాణించడం సూచీలకు దన్నుగా నిలిచింది. చివరకు బీఎస్‌ఈ 30 సూచీలో టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. రిలయన్స్, ఎన్‌టీపీసీ, టైటన్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement