Monday, May 6, 2024

సంపూ క్యాలీఫ్లవర్ కంప్లీట్

హృదయ కాలేయం, కొబ్బరిమట్ట వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు నటుడు సంపూర్ణేష్ బాబు. అయితే సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం క్యాలీఫ్లవర్ సినిమా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆర్కె మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా… చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా కు సంబంధించి మరో అప్డేట్ ని ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు చెబుతూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. మరి ఈ సినిమాతో సంపూర్ణేష్ బాబు ఏ మేర ప్రేక్షకులను నవ్విస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement