Saturday, April 20, 2024

అమెరికాలో కుప్పకూలిన భవనం.. 99 మంది మిస్సింగ్

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీలో ఓ 12 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు నిర్ధారించారు. మరో 99 మంది గల్లంతైనట్టు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 102 మందిని కాపాడగా.. 99 మంది కనిపించడం లేదని అధికారులు తెలిపారు. దాదాపు సగం కూలిపోయిన ఈ భవనంలో ఎంతమంది ఉన్నారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. మొత్తం 136 ఫ్లాట్లలో 55 ఫ్లాట్లు కుప్పకూలినట్టు గుర్తించారు.  అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ చాంప్లైన్ టవర్స్ సౌత్ బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు శిథిలాల నుంచి ఇద్దరిని వెలికితీసినట్టు చెప్పారు. ఈ భవనంలోని మరోవైపున ఉన్న ఫ్లాట్ల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. దీని చుట్టు పక్కల ఉన్న భవనాల నుంచి కూడా ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేయాలి.. ఎన్జీటీలో మరో దరఖాస్తు

Advertisement

తాజా వార్తలు

Advertisement