Tuesday, May 21, 2024

CM Jagan : ఇంటి బయటే డొక్కు సైకిల్…సింకులోవాడేసిన గ్లాస్

మంచిచేసే ఫ్యాన్ ఇంటిలోనే ఉండాలి
కూటమిని నమ్మితే అధోగతే
జరిగేది కురుక్షేత్రం
కులాల మధ్య కాదు.. ఇది క్లాస్ వార్
ఒక్కసారి ఆలోచించండి
నరసాపురంలో సీఎం జగన్ ప్ర‌చారం

- Advertisement -

ఆంధ్రప్రభ స్మార్ట్, నరసాపురం ప్రతినిధి: చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. రాష్ట్రంలో జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్. మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తోంది. ఇంటింటికి కేజీ బంగారం, బెంజి కారు ఇస్తారంట.. నమ్ముతారా?అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, మరోపది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతోంది. ఈ ఎన్నికలు రాబోయే మీ ఇంటి భవిష్యత్తును, సంక్షేమ పథకాలను నిర్ణయిస్తాయి. ఎన్నికలు. ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి అని అన్నారు. మీ బిడ్డను గెలిపిస్తే పథకాలు కొనసాగుతాయి, పొరబాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు తప్పదని సీఎం జగన్ హెచ్చరించారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమే. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. టీడీపీ పాలనలో ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశాడా? చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటారు.చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లు తలపెట్టినట్టేనని సీఎం అన్నారు.

ఇన్ని మంచి పనులు బాబు చేశాడా?

రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం. ప్రతీ రంగంలోనూ విప్లవం తీసుకువచ్చాం.ఈ పని చంద్రబాబు ఏనాడన్నా చేశాడా? అని ప్రశ్నించారు. మీ బిడ్డ జగన్.. అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడు. అక్కాచెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఆసరా, సున్నావడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం. అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. 31లక్షల ఇళ్లపట్టాలు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం, చంద్రబాబు ఏనాడన్నా ఇచ్చాడా? ఒక్కసారి ఆలోచించండి , అని సీఎం జగన్ వివరించారు. పేదవాడి వైద్యం కోసం రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. పేషంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం. ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం అని గుర్తు చేశారు.

డొక్కు సైకిల్ ఇంటి బయటే ఉండాలి

జగనన్న తోడు, జగనన్న చేదోడుతో చిరు వ్యాపారులకు సాయం అందించాం. గ్రామ సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం తెచ్చాం. రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశాం. రెండు లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాం, మీ బిడ్డ చేసిన పనిని గుర్తుంచుకోండి అని సీఎం జగన్ అన్నారు. వలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలి. పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీటు గెలవాల్సిందే. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులో నే ఉండాలి అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement