Wednesday, May 15, 2024

గెలాక్సీ ఎం 13 సిరీస్‌ను విడుదల చేసిన శాంసంగ్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : భారతదేశంలో అతిపెద్ద కన్స్యూమర్‌ ఎలక్ట్రాన్రిక్స్‌ బ్రాండ్‌ శాంసంగ్‌, నేడు గెలాక్సీ ఎం 13 మరియు గెలాక్సీ ఎం13 5జీ స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేసింది. అత్యంత ప్రాచుర్యం పొందిన గెలాక్సీ ఎం సిరీస్‌కు ఈ తాజా జోడింపులు అసాధారణ శైలి, సాటిలేని అనుభవాలను అందిస్తాయనే వాగ్ధానం చేయడంతో పాటు ఔత్సాహిక జెన్‌ ఎం జెడ్‌ వినియోగదారుల అవసరాలను సైతం తీర్చనున్నాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్లలో ఒకటి గెలాక్సీ ఎం సిరీస్‌. 2019వ సంవత్సరంలో దీనిని ఆవిష్కరించిన నాటి నుంచి ఇది 42 మిలియన్లకు పైగా యూనిట్లను దేశంలో విక్రయించిందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ వెల్లడిస్తుంది.

దేశంలో 5జీ విప్లవం మరింత ముందుకు తీసుకువెళ్తూ గెలాక్సీ ఎం 13 సిరీస్‌ 11 5జీ బ్యాండ్‌ మద్దతుతో వస్తుంది. ఈ విభాగంలో అగ్రగామి ఫీచర్లు అయినటు వంటి ఆటో డాటా స్విచ్చింగ్‌, 12 జీబీ ర్యామ్‌, ర్యామ్‌ ప్లస్‌, భారీ 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన గెలాక్సీ ఎం 13 సిరీస్‌ మాన్‌ స్టర్‌ పెర్ఫార్మెన్స్‌ను అందించడానికి కట్టు-బడి ఉందని శాంసంగ్‌ ఇండియా మొబైల్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ డైరెక్టర్‌, హెడ్‌ ఆదిత్య బబ్బర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement