Friday, April 26, 2024

ఇక అందుబాటులోకి శామ్‌సంగ్‌ క్రెడిట్‌ కార్డు

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ శ్యామ్‌సంగ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంతో క్రెడిట్‌ కార్డును విడుదల చేసింది. ఈ కార్డు తీసుకున్న కస్టమర్లుకు సంవత్సరమంతా శ్యామ్‌సంగ్‌ అన్ని ఉత్పత్తులపై 10 శాతం క్యాస్‌ బ్యాక్‌ ఆఫర్‌ను పొందుతారని కంపెనీ సౌత్‌వెస్ట్‌ ఆసియా ప్రెసిడెంట్‌, సీఈఓ కెన్‌ కాంగ్‌ తెలిపారు. ఆయా సందర్భాల్లో శ్యామ్‌సంగ్‌ ప్రకటించే ఆఫర్లకు ఈ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అదనం. ఈఎంఐలో కొనుగోలు చేసే కస్టమర్లకు కూడా ఇది వర్తిస్తుంది.

శ్యామ్‌సంగ్‌తో కలిసి విడుదల చేసిన ఈ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్టును పెద్ద నగరాలతో పాటు, 2,3 స్థాయి పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించామని యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ అమితాబ్‌ చౌదరీ చెప్పారు. వీసాతో కలిసి తీసుకు వచ్చిన ఈ క్రెడిట్‌ కార్డు వినియోగదారుల అవసరాలను తీరుస్తుందని చెప్పారు. ఈ కార్డుతో కస్టమర్లు బిగ్‌బాస్కెట్‌, మంత్రా, టాటా 1ఎంజీ, అర్బన్‌ కంపెనీ, జొమాటో నుంచి చేసే కొనుగోళ్లపై రివార్డు పాయింట్లు పొందుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement