Friday, April 26, 2024

అభిమానుల ఎదురుచూపుకి ఫుల్‌స్టాప్‌ పెట్టిన ఓంరౌత్.! అయేద్య‌లో ఆదిపురుష్ టీజ‌ర్

ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్ వినిపించాడు ద‌ర్శ‌కుడు ఓంరౌత్. కొన్ని రోజులుగా ఆదిపురుష్ టీజ‌ర్ రిలీజ్ డేట్ గురించి వ‌స్తున్న వార్త‌లు నిజం అని అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించాడు. రామాయ‌ణ గాథ ఆధారంగా తెర‌కెక్కుతున్న సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్న‌నారు. ప్ర‌భాస్ లుక్ ఎలా ఉంటుందో చూడాల‌ని అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వారికి ద‌ర్శ‌కుడు ఓంరౌత్ గుడ్‌న్యూస్ వినిపించాడు. అక్టోబ‌ర్ 2న ఆదిపురుష్ టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. అయోధ్య‌లో ఈ టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నాడు. ఈ టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్ కోసం స‌ర‌యు న‌ది ఒడ్డున ప్ర‌త్యేకంగా ఓ వేదిక‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలిపాడు. మూవీలో జాన‌కిగా కృతిస‌న‌న్ క‌నిపించ‌బోతున్న‌ది. త్రీడీతో పాటు ఐమాక్స్ వెర్ష‌న్‌లో ఆదిపురుష్ సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఓంరౌత్ వెల్ల‌డించాడు.

సంక్రాంతి కానుక‌గా 2023 జ‌న‌వ‌రి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాలం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. ఆదిపురుష్‌లో లంకేష్ అనే ప్ర‌తినాయ‌కుడిగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నాడు. చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్ర‌తీక‌గా ఆదిపురుష్ రూపోందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement