Thursday, April 25, 2024

అకారణంగా అటాక్​ చేస్తున్న పిట్​బుల్​ డాగ్స్​.. కాన్పూర్​ సిటీలో నిషేధం విధింపు

కాన్పూర్ సిటీ పరిధిలో పిట్‌బుల్, రాట్‌వీలర్ జాతి కుక్కలకు నిషేధం ఉంది. కాన్పూర్‌లోని సర్సయ్య ఘాట్‌లో ఓ పిట్‌బుల్ ఆవుపై దాడి చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పిట్‌బుల్ కుక్కల దాడి పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజల రక్షణకే ఈ చర్యలు చేపట్టినట్టు కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే తెలిపారు.

ఈ మధ్య కుక్కలు, పెంపుడు జంతువులు విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నాయని, ఉత్తరప్రదేశ్‌లో పిట్‌బుల్ ఆవుపై దాడి చేసిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్​ అయ్యింది. ఈ వీడియోలో కుక్క అకారణంగా తన యజమాని ఆదేశాలను పట్టించుకోకుండా ఆవు దవడ, మూతిపై కరిచేసింది. దీంతో ఆవుకు తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు, కుక్క యజమాని జోక్యం చేసుకుని కర్రతో కుక్కను కొట్టిన తర్వాత అది ఆవు ముఖాన్ని వదిలిపెట్టింది. ఇక.. సర్సయ్య ఘాట్ నివాసితుల వద్ద మొత్తం నాలుగు పిట్‌బుల్ కుక్కలు ఉన్నాయని స్థానికులు తెలిపాయి. వీటి వింత ప్రవర్తనతో తమ పిల్లలు, పశువుల పరిస్థితి ఏంటని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

US పిట్‌బుల్స్ లో 54 శాతం ఇంటి వ్యక్తలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇది 2018లో 41 శాతంగా ఉందని ఒక సర్వే నివేదిక పేర్కొంది. వాస్తవానికి 2019లో USలో 48 కుక్కకాటు సంబంధిత మరణాలు సంభవించగా, వాటిలో 69 శాతం పిట్‌బుల్స్ కు కారణమని ఈ సర్వే పేర్కొంది. అంతకుముందు లక్నోలో ఒక మహిళను ఆమె కొడుకు పెంచుకుంటన్న పిట్‌బుల్ కొరికి చంపింది. మరో ఘటనలో యూపీలోని ఘజియాబాద్‌లో కూడా పిట్‌బుల్ 11 ఏళ్ల బాలుడిని కొరికి చంపింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement