Monday, April 29, 2024

యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,627 కోట్ల సమీకరణ .

న్యూఢిల్లి : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ఐపీఓ ఘనంగా ప్రారంభమైంది. ఎల్‌ఐసీ ఐపీఓ యాంకర్‌ పెట్టుబడిదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని కంపెనీ మంగళవారం వెల్లడించింది. ఎల్‌ఐసీ యాంకర్‌ బుక్‌ ఓవర్‌ సబ్‌స్రైబ్‌ అయినట్టు వివరించింది. యాంకర్‌ ఇన్వెస్టర్ల విభాగానికి కేటాయించిన షేర్ల ద్వారా.. రూ.5,627 కోట్లు సమీకరించినట్టు వెల్లడించింది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు దరఖాస్తు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. వీరికి రూ.949 గరిష్ట ధర వద్ద షేర్లను కేటాయించినట్టు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఎల్‌ఐసీ వెల్లడించింది. ఎల్‌ఐసీ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఐపీఓ ద్వారా.. 22,14,74,920 షేర్లను రూ.902-రూ.949 ధరల శ్రేణిలో విక్రయిస్తున్నది. ఎల్‌ఐసీ ఐపీఓ నేడు ప్రారంభమై.. 9వ తేదీతో ముగుస్తుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల విభాగానికి 5.9 కోట్ల షేర్లను కేటాయించారు. దీంట్లో 4.2 కోట్లు షేర్లు (71.12 శాతం) 99 పథకాల ద్వారా 15 దేశీయ మ్యూచువల్‌ ఫండ్లకు కేటాయించారు. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, కొటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ పెన్షన్‌ ఫండ్‌, యూటీఐ రిటైర్‌మెంట్‌ సొల్యూషన్స్‌ పెన్షన్‌ పంఢ్‌ స్కీం వంటి సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement