Monday, April 29, 2024

Big story : ఐసీఐసీఐ ఆధ్వర్యంలో పిఎస్‌యు ఈక్విటీ ఫండ్‌.. దీర్ఘకాల పెట్టుబడులకు మెరుగైన పథకం

భారతదేశంలోని అతిపెద్దదైన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, తాజాగా మరొక ఆకర్షణీయ ఫండ్‌ను ప్రారంభించింది. ఐసిఐసిఐ పిఎస్‌యు ఈక్విటీ ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ఓపెన్‌ -ఎండ్‌ ఈక్విటీ స్కీమ్‌. దీర్ఘకాల లక్ష్యాలతో పెట్టుబడులు పెట్టేవారికి ఆకర్షణీయమైన లాభాలను ఇస్తుంది. దీనిద్వారా ప్రభుత్వరంగ కంపెనీలలో ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. మిడ్‌క్యాప్‌ లేదా స్మాల్‌ క్యాప్‌లలోనూ పెట్టుబడులకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఒ అమలులో ఉంది. సెప్టెంబర్‌ 6న ముగుస్తుంది. ఈ పథకం గురించి ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్‌ ఎఎమ్‌సి ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజీ హెడ్‌ చింతన్‌హరియా మాట్లాడుతూ, క్యాపిటల్‌ మార్కెట్‌లో పిఎస్‌యు కంపెనీలు ముఖ్యమైన విభాగం. వివిధ రంగాలలో విస్తృత పెట్టుబడికి అవకాశాలను అందజేస్తున్నాయి. అలాగే పిఎస్‌యుల వ్యాల్యూయేషన్‌ ప్రాతిపదికన ఆకర్షణీయంగా కూడా ఉన్నాయి. అస్థిర పరిస్థితుల్లోనూ అధిక డివిడెండ్‌ను అందించే కంపెనీలు డిమాండ్‌ను కలిగివుంటాయి. ఫలితంగా మూలధన విలువ పెరుగుతుందని చెప్పారు. ఈ ఫండ్‌ను మిత్తుల్‌ కలావాడియా, ఆనంద్‌శర్మ నిర్వహిస్తారు.

సురక్షితం.. ఆకర్షణీయం..

ప్రభుత్వరంగ సెక్టార్‌లో ఎఫ్‌పీఐలు, డీఐఐలు, రిటైల్‌ వాటాదారులతో పోల్చితే ప్రభుత్వ హోల్డింగ్‌ అధికంగా ఉంటుంది. ఇది కంపెనీల భవిష్యత్‌కు సురక్షితం. నాన్‌ ప్రమోటర్ల యాజమాన్యంలో ఉన్నందున పిఎస్‌యు రంగంలో మెరుగైన మార్జిన్‌ను కూడా అందిస్తుంది. పిఎస్‌యు స్పేస్‌లో వ్యాల్యుయేషన్స్‌ కొంతకాలంగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఈ వ్యాల్యుయేషన్స్‌ కంపెనీలకు మెరుగైన మార్జిన్‌ ఆఫ్‌ సేఫ్టీ ఉందని సూచిస్తుంది. అదేవిధంగా, విస్తృత మార్కెట్‌ కంటే ప్రభుత్వరంగ సంస్థలు మెరుగైన డివిడెండ్‌ రాబడులను అందిస్తాయి. ఎస్‌అండ్‌పి-బిఎస్‌ఈ పిఎస్‌యు సూచీ (గత 17 సంవత్సరాలు) సగటు డివిడెండ్‌ 2.6 అయితే, ఎస్‌అండ్‌పి బిఎస్‌ఈ సెన్సెక్స్‌ సగటు డివిడెండ్‌ 1.3గా ఉంది. అస్థిర వాతావరణంలో అధిక డివిడెండ్‌ అందించే కంపెనీలు అధిక డిమాండ్‌ను కలిగివుంటాయి. ఫలితంగా మూలధన విలువ పెరుగుతుంది.

డిమాండ్‌ ఉన్న పిఎస్‌యులు

బ్యాంకులు: ప్రభుత్వరంగ బ్యాంకులు చక్రీయమార్పు మధ్యదశలో ఉన్నాయి. ఈక్విటీ రిటర్న్స్‌ ఇప్పుడిప్పుడే పుంజుకోవడం ప్రారంభించింది. మెరుగైన ఆస్తి నాణ్యతతో చూస్తే క్రెడిట్‌ధర దిగువకు పడిపోయినట్లు కనిపిస్తోంది.

- Advertisement -

రక్షణరంగం: సైనిక ఉత్పత్తుల్లోనూ కేంద్ర ప్రభుత్వం మేకిన్‌ ఇండియాను ప్రోత్సహిస్తోంది. ఇందుకు రూ.764 బిలియన్లు కేటాయించింది. రక్షణ సామర్థ్యాలు పెంపొందించడానికి, వ్యవస్థలు లేదా పరికరాలను దేశీయంగా తయారు చేయడం ద్వారా విదేశీ వ్యయం తగ్గుతుంది.

విద్యుత్‌; పవర్‌ జనరేషన్‌లో ప్రధానంగా పిఎస్‌యు సంస్థలదే ఆధిపత్యం ఉంది. మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. ఇది విద్యుత్‌ ఉత్పాదక కేంద్రాల కోసం స్థిరమైన ఆర్‌వోఈతో ఈ రంగానికి సానుకూలం.

సంస్కరణల ప్రోత్సాహం:

ఎన్నికలకు ముందు ప్రభుత్వరంగ సంస్థలు సంస్కరణల ఆశావాదంతో మంచి పనితీరు కనబరుస్తాయి. ముందస్తు ఎన్నికల వ్యవధినిబట్టి రాబోయే రెండేళ్లలో పిఎస్‌యులు బాగా రాణిస్తాయని అంచనా. ఇవికాకుండా, పిఎస్‌యు స్టాక్స్‌లో పెట్టుబడులు కూడా అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి. మెరుగైన క్రెడిట్‌ రేటింగ్‌కు దారితీసే స్వాభావిక సార్వభౌమ సౌలభ్యం కారణంగా కొత్త రుణాల అవసరం తక్కువగా ఉంటుంది. ప్రమోటర్ల ఆధ్వర్యంలోని కంపెనీలతో పోల్చితే, ప్రభుత్వరంగ స్టాక్స్‌ దృక్పథం సాపేక్షంగా తక్కువ రిస్క్‌ను కలిగివుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement